దుబాయ్‌లో సర్కారువారి పాట లాంగ్ షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ తన 27వ సినిమా సర్కారు వారిపాట కోసం దుబాయ్ చేరుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో నమ్రత బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన మహేశ్ ఈ నెల 25 నుండి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడట. దాదాపు నెల రోజుల పాటు దుబాయ్ షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ముందుగా ఈ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో యు.ఎస్ షెడ్యూల్ కంటే ముందుగానే ఇండియా షెడ్యూల్‌ను అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు యు.ఎస్ షెడ్యూల్‌ను దుబాయ్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. అందులో భాగంగానే సర్కారు వారిపాట టీమ్ దుబాయ్ చేరుకుందని సమాచారం.దుబాయ్ షెడ్యూల్ తర్వాత ఇండియాలో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు.
కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. రీసెంట్గా ఈ చిత్రంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సినిమా రూపొందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com