‘స‌ర్కారువారి పాట’ దుబాయ్ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Monday,February 22 2021]

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మహేశ్‌ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ నిర్మిస్తున్నాయి. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ దుబాయ్‌లో నెల రోజులుగా జరిగింది. తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లోపూర్తి చేసుకున్న సినిమా యూనిట్ హైద‌రాబాద్ బ‌య‌లు దేరింది. దుబాయ్ షెడ్యూల్‌లో మ‌హేశ్‌, కీర్తిసురేశ్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను చిత్రీక‌రించారు.

నెక్ట్స్ షెడ్యూల్‌ను ఇక‌పై ఇండియాలో చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వివ‌రాల మేర‌కు గోవాలో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత‌లు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతికి హిట్ కొట్టిన మహేశ్ మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతుండటం ఆయన ప్యాన్స్‌కు హ్యాపీగా ఉంది. ఇందులో మ‌హేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియ‌ర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో క‌నిపిస్తార‌ని సమాచారం. ఎస్‌.ఎస్.తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

ర‌వితేజ 68 అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ.. సంక్రాంతికి క్రాక్ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన ఈ హీరో ఆదివారం రోజున త‌న కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న అను ఇమ్మాన్యుయేల్?

దర్శకులతో హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు దర్శకులతో ప్రేమాయణం నడపడమే కాదు..

ఆసక్తికరంగా మారిన పవన్, అలీల కలయిక..

2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం చాలా మంచి స్నేహితులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ అలీల మధ్య విభేదాలు వచ్చాయంటూ టాక్ నడిచింది.

'ఏ1 ఎక్స్‌ప్రెస్' మార్చి 5న‌ రిలీజ్‌

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్

`గాలి సంపత్ `తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది - దిల్‌రాజు

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం  'గాలి సంప‌త్`. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో