‘సర్కారువారి పాట’ దుబాయ్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, పరశురామ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో నెల రోజులుగా జరిగింది. తొలి షెడ్యూల్‌ను దుబాయ్లోపూర్తి చేసుకున్న సినిమా యూనిట్ హైదరాబాద్ బయలు దేరింది. దుబాయ్ షెడ్యూల్లో మహేశ్, కీర్తిసురేశ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు.
నెక్ట్స్ షెడ్యూల్‌ను ఇకపై ఇండియాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. వివరాల మేరకు గోవాలో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతికి హిట్ కొట్టిన మహేశ్ మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతుండటం ఆయన ప్యాన్స్‌కు హ్యాపీగా ఉంది. ఇందులో మహేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com