'స‌ర్కార్' టీజ‌ర్ డేట్‌

  • IndiaGlitz, [Wednesday,October 10 2018]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రలో న‌టిస్తుంది.

'త‌పాకీ', 'క‌త్తి' సినిమాల త‌ర్వాత విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉంటుంది. ఇందులో విజ‌య్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని టాక్ విన‌ప‌డుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ తుది ద‌శ‌కు చేరుతున్నాయి.

ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 8న తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది.

More News

నానా ప‌టేక‌ర్‌కు వ‌ర్మ స‌పోర్ట్‌

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని హీరోయిన్ త‌ను శ్రీద‌త్తా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం ప్రారంభ‌మైంది.

తెలుగులోకి ఐశ్వ‌ర్య రాజేశ్‌

తెలుగులో సీనియ‌ర్ మ‌హిళా క‌మెడియ‌న్‌, న‌టి శ్రీల‌క్ష్మి గురించి తెలియ‌ని వారు త‌క్కువ మందే ఉంటారు.

శ్రీదేవిగా ర‌కుల్ లుక్ అదిరిందిగా!

నిన్న‌టి త‌రం అందాల న‌టి శ్రీదేవి గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెర‌పై త‌ళుక్కుమ‌ని మెర‌వ‌నున్నారు. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ కోసం ర‌కుల్ ఈ పాత్ర‌ను పోషిస్తున్నారు.

స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు - త్రివిక్ర‌మ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మమ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. 'A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు.