Sarkar Review
మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను అందరికీ నచ్చేలా కమర్షియల్ స్టైల్లో తెరకెక్కించడం అంత సులభం కాదు. అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే వీలవుతుంది. ఆ దర్శకుల లిస్టులో ఎ.ఆర్.మురగదాస్ ఒకరు. ఈయనకు తెలుగు సినిమా పరిశ్రమ కలిసి రాలేదు కానీ.. తమిళంలో ఈయన డైరెక్ట్ చేసిన చిత్రాలు తెలుగులో అనువాదమై.. రీమేకై అద్భుతమైన ఆదరణను పొందాయి. విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన తుపాకి, కత్తి చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీయే `సర్కార్`. అసలు తానేం చెప్పబోతున్నాననే పాయింట్‌ను మురగదాస్ ట్రైలర్ రూపంలో చెప్పేశాడు. ఎన్నికల్లో ప్రజల ఓటు విలువను చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. మరి మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాడులో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సర్కార్ విజయ్‌కు ఇబ్బందులను తెచ్చిపెట్టిందా? లేక మరో విజయాన్ని అందించిందా? అని తెలుసుకోవాంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
అమెరికాలో ఉండే ఎన్నారై సుందర్ రామస్వామి(విజయ్)కి ఐదేళ్లక ఓసారి ఓటు వేసే అలవాటు ఉంటుంది. అలవాటులో భాగంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తే.. తన ఓటును మరెవరో దొంగ ఓటు వేసేశారని తెలుస్తుంది. దాంతో న్యాయస్థానికి వెళ్లి సెక్షన్ 49పి క్రింద ఓటు హక్కు సంపాదిస్తాడు. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో రాజకీయనాయకుడు(రాధారవి) సుందర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. దాంతో సుందర్‌కి కోపం వచ్చి దొంగ ఓటు వల్ల తమ ఓటు హక్కు కోల్పోయిన వారందరినీ రెచ్చగొడతాడు. దాంతో అందరూ కోర్టుకు వెళతారు. ఎన్నికలు రద్దు చేయబడతాయి. ముఖ్యమంత్రి కాబోయి చివరి నిమిషంలో ఎన్నికలు రద్దు చేయబడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి(పాల కరుపయ్య), అతని కుమార్తె కోమలవల్లి(వరలక్ష్మి శరత్‌కుమార్) సుందర్‌ని టార్గెట్ చేసి చంపాలనుకుంటారు. దాంతో సుందర్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగి.. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతారు. అప్పుడు కోమలవల్లి ఏం చేస్తుంది? ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది? వాటిని సుందర్ ఎలా అడ్డుకుంటాడు? అని తెలుసుకోవాలంటే సినిమా థియేటర్‌కి వెళ్లాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
విజయ్ సినిమాకు ప్రధాన బలం. మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావడం.. అది వరకు తుపాకి, కత్తి వంటి సూపర్‌హిట్ చిత్రాలు విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చి ఉండటంత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఎప్పటిలాగానే తన పాత్రకు న్యాయం చేశారు. స్టైలిష్ లుక్‌తో కనపడుతూ తనదైన నటనతో, డాన్సులు, యాక్షన్ పార్ట్‌తో మెప్పించాడు విజయ్. గిరీశ్ గంగాధరన్ కెమెరా వర్క్ బావుంది. సినిమాలో చెప్పిన సెక్షన్ 49పి పాయింట్ బావుంది.
మైనస్ పాయింట్స్:
పాత్రకుల పెద్దగా ప్రాధాన్యత కనపడలేదు. మురగదాస్ ఫోకస్ అంతా హీరో ఇమేజ్‌ను పొలిటికల్ యాంగిల్‌లో చూపడంలో..ఇమేజ్‌ను హైప్ చేయడంలో చూపాడని సినిమా చూస్తే అర్థమైంది. హీరోయిన్ కీర్తి సురేశ్‌కు నటన పరంగా స్కోపే కనపడదు. వరలక్ష్మి శరత్‌కుమార్ పొలిటీషియన్ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె రోల్ వ్యవధి తక్కువగానే ఉంది. యోగిబాబు పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. విలన్స్‌గా నటించిన పాల కరుపయ్య, రాధారవి పాత్రలకు కథ పరంగా ఎఫెక్టివ్‌నెస్ కనపడదు. మురగదాస్ ఎమోషనల్‌గా సబ్జెక్ట్‌ను కనెక్ట్ చేయించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకోవడంలో మురగదాస్ ప్లాప్ అయ్యాడు. హీరో బిల్డప్ మీద పెట్టిన ఫోకస్ కథ, కథనంపై పెట్టి ఉంటే బావుండేదనిపించింది. ఇక రెహమాన్ సంగీతం విషయానికి వస్తే ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఏవీ బాలేవు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే బావుండేది. మురగదాస్ కథను నడిపిన తీరు గందరగోళానికి గురి చేస్తుంది. ఓటు విలువను చెప్పే సినిమా అన్నప్పడు ప్రజల్లో చైతన్యం వచ్చేలా సినిమా ఉండాలి. కానీ అలా కాకుండా ప్రజలు హీరో వర్షిప్‌గా కనపడుతూ ఉంటారు. హీరో రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేశాడనే పాయింట్‌కు .. ఓ కుటుంబం కిరోసిన్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించడానికి సంబంధం ఉండదు. ప్రతి దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పది మందికి హీరో ఆదరణ ఇస్తే సరిపోదు కదా.. మరి రాష్ట్రంలో అలాంటి వారు ఎంత మంది ఉంటారు. ఈ పాయింట్‌ను డీప్‌గా టచ్ చేయడంలో మురగదాస్ ప్లాప్ షో చేశాడు.
చివరగా...
విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్...తమిళనాట రాజకీయాల్లో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ వస్తుండటంతో విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు బలంగా ఉండటంతో మురగదాస్ ఈ పాయింట్‌ను ఎంచుకుని హీరోని పొలిటికల్ ఆలోచనలకు తెరపై ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీని వల్ల హీరో క్యారెక్టర్ ఓవర్ బిల్డప్ అయ్యింది కానీ.. సెక్షన్ 49పి అనే ఎలిమెంట్‌ను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. అభిమానులకు మాత్రమే ఈ సినిమా ఊపు ఇస్తుందేమో కానీ .. అంచనాలతో వెళ్లే వారికి నిరాశ తప్పదు.
Read 'Sarkar' Movie Review in English
- Read in English