ఆర్జీవీ పుట్టినరోజున రానున్న సర్కార్ 3

  • IndiaGlitz, [Thursday,February 09 2017]

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ 3'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్ లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన "సర్కార్ 3" చిత్రాన్ని పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ నిర్మిస్తున్నారు.

More News

'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుంది : కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.

సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుంది

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఘాజీ. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం 1971 బ్యాక్డ్రాప్లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈ సినిమాలో తాప్సీ ఓ కీలకపాత్రలో నటించింది.

నానితో మలయాళ ముద్దుగుమ్మ...

సిద్దార్థ, శృతిహాసన్, హన్సికలతో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్రాజు నిర్మించాడు.

సింగం తెలుగు షోలు ఆగాయి...

సూర్య, అనుష్క, శృతిహాసన్లు హీరో హీరోయిన్లుగా తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రం `సింగం3`. ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

వాటన్నింటికంటే ఉత్తమమైన కమిటీ ఇది : పరుచూరి వెంకటేశ్వరరావు

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసీ మెంబర్ల చివరి సమావేశం మంగళవారం హైదరాబాద్ బృగవాణి రిసార్స్ట్ లో జరిగింది.