‘భయపడేవాడు బేరానికి వస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..!’
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్‌కే పరిమితమైన చిత్రబృందం తాజాగా.. టీజర్ రిలీజ్ చేసింది. కాగా, ఈ టీజర్లో మహేశ్ బాబు పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టేశాడు. మరోవైపు విజయశాంతి అలియాస్ రాములక్క కూడా సింగిల్ డైలాగ్‌తో సూపర్బ్ అనిపించేశారు. ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే.. ఆయనకు కూడా టీజర్లో సింగిల్ డైలాగ్ ఉంది.
డైలాగ్స్ కిరాక్..!
‘మీరెవరో మాకు తెలియదు.. మీకూ మాకూ ఏ రక్త సబంధం లేదు. కానీ మీ కోసం మీ పిల్లల కోసం.. పగలు, రాత్రి.. ఎండా వానా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అనే మహేశ్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటాన్రా.. మీ కోసం ప్రాణాలిస్తున్నాం రా అక్కడ.. మీరేమే కత్తులు, గొడ్లళ్లేసుకుని.. బాధ్యత లేదా రా..’ అంటూ మహేశ్ ఒకింత ఆలోచింపజేసే డైలాగ్‌తో చింపేశాడు. ‘భయపడేవాడు బేరానికి వస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..!’ అని మహేశ్ దుమ్ముదులిపేశాడు. కాగా టీజర్ మొత్తానికి ఈ డైలాగే హైలైట్‌గా నిలిచింది.
మహేశ్ ఫ్యాన్స్‌కు మిఠాయి!
‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్..’ అంటూ విజయశాంతి సైతం తనదైన శైలిలో డైలాగ్ అదుర్స్ అనిపించారు. మరోవైపు.. సినిమాలో విలన్‌గా నటిస్తున్న ప్రకాష్ రాజు.. ‘ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లొస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు!’ అంటూ కోపంతో డైలాగ్ చెబుతాడు. మొత్తమ్మీద చూస్తే అనీల్ కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్, మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ షురూ చేసినప్పటికీ తియ్యటి మిఠాయిలాంటి టీజరే అందించాడని చెప్పుకోవచ్చు. ఇక పిక్చరైజేషన్ గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పునక్కర్లేదు. ఇప్పటికే వ్యూస్ పరంగా టీజర్ యూట్యూబ్‌లో యమా స్పీడ్‌తో పరిగెడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments