నవంబర్ 23న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. సినిమా ఇప్పుడు తుది దశ చిత్రీకరణకు చేరుకుంది. కాగా.. శనివారం చిత్ర యూనిట్ టీజర్ గురించి ఓ న్యూస్‌ను ఇచ్చింది. త్వరలోనే టీజర్ విడుదలవుతుందనేదే వార్త. టీజర్ లోడింగ్ అని ట్వీట్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఎప్పుడనేది చెప్పలేదు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ టీజర్‌ను నవంబర్ 23న విడుదల చేస్తారట. పర్టికులర్‌గా నవంబర్ 23నే ఎందుకంటే సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు అప్పుడే కావడం. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలతో డిజిటల్, శాటిలైట్ హక్కులు బిజినెస్ పూర్తయ్యింది. హిందీలో మన సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ మోస్తరు సినిమాలకు హిందీలో మంచి డిజిటల్ , శాటిలైట్ బిజినెస్ జరుగుతుంది. ఆ క్రమంలో మహేశ్ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.15.25 కోట్లకు డీల్ పూర్తయ్యిందని టాక్. త్వరలోనే థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుందని ట్రే్‌డ వర్గాలు అంటున్నాయి. అలాగే రీసెంట్‌గా ఈ సినిమా ఓవర్‌సీస్ హక్కులను గ్రేట్ ఇండియా సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. దీని వివరాలు తెలియాల్సి ఉంది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తున్నారు. మహేశ్ ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాశ్‌రాజ్, రాజేంద్ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ౠమహర్షిౠ తర్వాత మహేశ్ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, దిల్‌రాజులతో పాటు మహేశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com