ఖాకీ చొక్కాల మీద, మిలిటరీ యూనిఫార్మ్ మీద మనకున్న క్రేజ్ ఇంకో రేంజ్‌లో ఉంటుంది. అభిమాన హీరోల్ని ఆ కాస్ట్యూమ్స్ లో చూసుకోవాలనే కోరిక ఫ్యాన్స్ లో బాగా ఉంటుంది. ఆ ఫ్యాన్స్ పల్స్ పట్టుకున్న మేకర్స్ అప్పుడప్పుడు వెరైటీ అటెంప్ట్స్ చేస్తుంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి చేసినట్టు. ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్ లో గన్ పట్టుకున్న మహేష్‌ని నిలుచోబెట్టి సరిలేరునీకెవ్వరు అని పోస్టర్ వేయగానే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆటోమేటిగ్గా నెక్స్ట్ అప్‌డేట్స్ ఫాలో అయ్యారు. సంక్రాంతి రేసులో రిలీజైంది సరిలేరునీకెవ్వరు. ఘట్టమనేని అభిమానులతో పాటు మిగిలిన సినీ గోయర్స్ ని మెప్పించేలా ఉందా? జవాన్లను చూసి సెల్యూట్ చేసేలా ఉందా? 13 ఏళ్ల తర్వాత విజయశాంతి సినిమా ఒప్పుకోవడంలో అర్థం కనిపిస్తోందా? డోంట్ వెయిట్... జస్ట్ గో థ్రూ ద రివ్యూ
కథ:
అజయ్ (మహేష్ బాబు) కాశ్మీర్ రెజిమెంట్ మిలిటరీలో మేజర్‌గా ఉంటాడు. అదే రెజిమెంట్‌లో కొత్తగా మరో అజయ్ (సత్యదేవ్) చేరుతాడు. అతని మాటలను బట్టి, అతని చెల్లెలికి పెళ్లి అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు మేజర్ అజయ్. వాళ్లిద్దరూ కలిసి చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్తారు. అక్కడ శత్రువు రెచ్చగొట్టడంతో కొత్తగా చేరిన అజయ్ గట్టిగా రెస్పాండ్ అవుతాడు. శత్రువుల ఉచ్చులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపే బాధ్యతను పై అధికారి (మురళీశర్మ) అజయ్ మీద ఉంచుతాడు. దాంతో ప్రసాద్ (రాజేంద్రప్రసాద్)ను వెంట పెట్టుకుని రైల్లో కర్నూలుకు బయలుదేరుతాడు అజయ్. అక్కడ అతనికి సంస్కృతి (రష్మిక) కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. తన కాళ్ల దగ్గర పడి ఉండే అల్లుడు కావాలని మూడో కూతురిని సత్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు ఆమె తండ్రి (రావు రమేష్). తల్లి (సంగీత), పెద్ద సోదరి (హరితేజ) మాత్రం చిన్న చెల్లెలిని మంచి వాడికి ఇచ్చి చేయాలనుకుంటుంటారు. సరిగ్గా అదే సమయంలో వారికి మేజర్ అజయ్ కనిపిస్తాడు. చూడగానే పర్ఫెక్ట్ అల్లుడని అందరూ ఫిక్సవుతారు. అతన్ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు. మరోవైపు కర్నూలులో సోల్జర్ అజయ్ తల్లి భారతి (విజయశాంతి) చిక్కుల్లో ఉంటుంది. ఆమె కుటుంబాన్ని మినిస్టర్ (ప్రకాష్ రాజ్) నిలువ నీడ లేకుండా చేసి ఉంటాడు. దానికి కారణం ఏంటి? మినిస్టర్ చేతుల్లో పోయిన ఆ ఇద్దరి ప్రాణాలు ఎవ్వరివి? వాళ్లకీ భారతికి సంబంధం ఏంటి? సోల్జర్ అజయ్ ఫ్యామిలీ మేజర్ అజయ్‌ని ఎలా చూసింది? సంస్కృతిని అజయ్ అంగీకరించాడా? లేదా? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్‌పాయింట్లు:
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- మహేష్, విజయశాంతి సీన్స్
- అక్కడక్కడా కామెడీ
- క్లైమాక్స్ ఫైట్
- పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
- కెమెరా
నెగటివ్ పాయింట్స్:
- ఆర్మీ ఎపిసోడ్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉండాల్సింది
- స్క్రీన్‌ప్లే
- ముందే ఊహకు అందే కథ
- క్లైమాక్స్ తేలిపోయింది
సమీక్ష:
సంక్రాంతి సీజన్ అంటే కోళ్ల పందాలు ఒకపక్క అయితే.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల సందడి ఉంటుంది. అందుకనే ఈ సీజన్‌లో భారీ సినిమాలను తెలుగులో విడుదల చేయడానికి హీరోలు, దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. అలా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. భరత్ అనే నేను, మహర్షి చిత్రాల్లో సీరియస్‌గా నటించిన మహేశ్ .. ఈసారి ట్రెండ్ మార్చాడు. పక్కా కమర్షియల్ సినిమాలే చేసినా,కామెడీతో ప్రేక్షకులను నవ్వించాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసమనే కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. పాత్ర పరంగా చూస్తే ఒక పక్క దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుడిగా సీరియస్ పాత్ర చేస్తూనే మరో పక్క కామెడీ ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ట్రైన్ కామెడీ పార్ట్‌లో రావు రమేశ్, సంగీత, రష్మిక, రాజేందప్రసాద్‌లతో కలిసి మంచి కామెడీని పండించాడు. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ ప్రేక్షకులను సంగీత మంచి కామెడీ నటనతో ఆకట్టుకుంది. రావురమేశ్, సత్య, అప్పారావు, బండ్లగణేశ్, రాజేంద్రప్రసాద్ అందరూ ఈ ఎపిసోడ్‌లో ప్రేక్షకులను అలరించారు. ఇక పత్రిపాత్రను డిఫరెంట్‌గా, కామెడీ యాంగిల్‌లో మలిచి కామెడీ ట్రాక్‌ను సక్సెస్ చేసే అనిల్ రావిపూడి కామెడీ పరంగా ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. యాక్షన్ పరంగా చూస్తే ట్రెరర్ ఎటాక్ ఫైట్, సెకండ్ హాఫ్‌లో వచ్చే నల్లమల ఫారెస్ట్ పైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక సినిమాలో కీలక పాత్ర విజయశాంతి గురించి చెప్పాలంటే ముగ్గురు పిల్లల తల్లిగా నటించింది. సీరియస్ పాత్ర అనగానే ఏదో బిగుసుకుని ఉండాలన్నట్లు ఆమె పాత్రను చూపించారు. ఆమె పాత్రను చూపించాల్సినంత గొప్పగా చూపించలేదు. డైరెక్టర్ అనిల్ కథ విషయంలో కేర్ తీసుకుని ఉండుంటే బావుండేది. అసలు కథే లేకుండా కామెడీ ట్రాక్‌తోనే సినిమా నడిపించాలని అనుకున్నాడు. కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వించినా కథను డివియేట్ చేసేస్తుంది. సినిమా మొదలైన 20 నిమిషాలకు ట్రైన్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది కానీ.. ఇక్కడ పాత్రలు కామెడీగా ఉన్నా.. అది ఓవర్ డ్రెమటిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా నచ్చని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయి పారిపోవడం వరకు ఓకే కానీ.. ఎవడో ఒకడిని తగులు కోవాలనుకోవడం అనే కాన్సెప్ట్ ఏంటో.. కామెడీకే అయినా హీరోయిన్ క్యారెక్టర్‌ని తక్కువ చేసినట్లు గా అనిపిస్తుంది. అలాగే సంగీత క్యారెక్టర్ కూడా అంతే అక్కడ నుండి సినిమా కర్నూలుకి రావడం అక్కడితో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇక అసలు సినిమాలోకి వెళ్లినట్లే ఉన్నా.. అప్పటి వరకు పవర్‌ఫుల్‌గా ఉన్న తర్వాత కామెడీ చేసేశాడు. అసలు అప్పటి వరకు స్వార్థ రాజకీయ నాయకులు ఏదో మహేశ్ చెప్పగానే.. మారిపోవడం అనే అంశం కూడా లాజిక్‌కి అందదు. అంత వరకు కొడుకు గురించి పట్టించుకోని విజయ శాంతి పాత్ర చివరలో కొడుకు గురించి ఆరా తీయడం ఏంటో అర్థం కాదు. ఒక పక్క దేశంలో జరుగుతున్న సార్థ రాజకీయ నాయకులు గురించి చెబుతూనే దాన్ని లాజిక్‌కి దూరంగా చూపెట్టడం కమర్షియల్ సినిమాలో భాగమనుకోవాలేమో. టెక్నీషియన్స్ పరంగా చూస్తే.. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో పాటలు బాగాలేవు. మైండ్ బ్లాక్, టైటిల్ ట్రాక్ మాత్రం బావున్నాయి. మిగిలిన పాటలేవీ మెప్పించవు. నేపథ్య సంగీతం ఓకే. రత్నవేలు కెమెరాపనితనం బావుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుని ఉండాల్సిందనిపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: అభిమానులను అలరించే `సరిలేరు నీకెవ్వరు`
Comments