‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ డేట్ మార్చిన మహేశ్..!?

  • IndiaGlitz, [Wednesday,September 25 2019]

సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు చాలా వరకూ పూర్తయ్యింది. మహేశ్‌బాబు, సీనియర్ నటి కమ్ పొలిటిషియన్ విజయశాంతిపై సన్నివేశాలు చిత్రీకరణ పూర్తవ్వగా.. ఇప్పుడు హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు చక చకా పనులు కానిచ్చేస్తున్నారు. అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఒక్క తెలుగులోనే సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి.

సరిగ్గా ఇదే సంక్రాంతికే సినిమా రిలీజ్ చేయాలని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రయూనిట్ ముందుగానే ఫిక్స్ చేసుకుంది. అయితే.. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రజనీకాంత్ ‘దర్బార్’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ 12న ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.

అయితే మహేశ్ మాత్రం ఈ డేట్‌లో రిలీజ్‌కు ఒప్పుకోలేదట. తాను సూచించిన జనవరి 14న విడుదల చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని దర్శకనిర్మాతల ముందు ఉంచారట. ఆ రోజున సినిమా రిలీజ్ ఉంటే.. ఓపెనింగ్స్ బాగుంటాయనే అభిప్రాయాన్ని మహేశ్ చెప్పారట. అయితే ఈ విషయంపై అందరం కూర్చొని ఓ నిర్ణయానికి వద్దామని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి మహేశ్ మాటకు విలువిచ్చి 14న రిలీజ్ చేస్తారో..? లేకుంటే దర్శకనిర్మాతలు అనుకున్న టైమ్‌కే రిలీజ్ చేస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

రైతన్నలు, డ్వాక్రా మహిళలకు జగన్ శుభవార్త

2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు.

రివర్స్ టెండరింగ్‌పై జగన్ తొలిసారి స్పందన..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు - డాక్టర్ రాజశేఖర్‌

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ అన్నారు.

అమితాబ్‌ని ఆ అవార్డు వరించడం చాలా సంతోషంగా ఉంది: చిరంజీవి

లివింగ్ లెజెండ్ శ్రీ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.

వేణుమాధ‌వ్ మృతికి చిరంజీవి సంతాపం

ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్ లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా  తుదిశ్వాస  విడిచిన సంగ‌తి తెలిసిందే.