‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రమిది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో మహేశ్ మ్యూజికల్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరుగా మార్చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రతి సోమవారం సినిమాలోని పాటలను విడుదల చేస్తామని యూనిట్ తెలియజేసింది. అలాగే డిసెంబర్ 2న తొలి పాటను విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చితానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక డిసెంబర్ 30న సినిమాలోని ఫైనల్ సాంగ్ విడుదలవుతుంది. దీంతో పాటల సందడి పూర్తవుతుంది. ఇక మిగిలిన ప్రధాన కార్యక్రమాన్ని జనవరి 5న హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి యూనిట్ ప్లాన్ చేసిందని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.
రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రకాశ్‌రాజ్ ఇందులో మరో కీలక పాత్రలోనటిస్తున్నాడు. భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత మహేశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే టైటిల్ ట్రాక్‌కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా విడుదల తర్వాత మహేశ్ కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com