‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు(డిసెంబర్ 18) పూర్తయింది.
ఈ సందర్భంగా..
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ``జులై 5న మొదలైన ఈ 'సరిలేరు నీకెవ్వరు' మెమొరబుల్ జర్నీడిసెంబర్18తో పూర్తయింది. సినీ ప్రేమికులకు, మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సంక్రాంతి ఒక మెమరబుల్ గా ఉండబోతుంది`` అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - ``ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత మరపురాని జ్ఞాపకాన్నిఇచ్చిన నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ధన్యవాదాలు. అలాగే ఈ అద్భుతమైన షూటింగ్ ని సంతోషకరంగా ముగించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్, కిశోర్ గరికిపాటి సహా ఎంటైర్ ’సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ కి థాంక్స్' అన్నారు.
ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్ననాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నవిషయం తెలిసిందే..
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments