‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆంథమ్ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, మాస్ సాంగ్, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం నుండి అందరూ ఎదురు చూస్తున్న ’సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్ ఫుల్ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.
``భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు..పెళ పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు..సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు..సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు...``అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌కి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు దేవి శ్రీ ప్రసాద్. యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా్ల్లో ఒకటైన మేసెడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రా్తో రికార్డ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్ ఈ పాటని హృద్యంగా ఆలపించారు.
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నవిషయం తెలిసిందే..
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com