'సర్దార్' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం 'సర్దార్' బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారాన్ని ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం ఎక్స్ టార్డినరీగా వుంది. విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా కూడా ట్రైలర్‌లో కనిపించి అంచనాలు పెంచారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.
దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది.
తారాగణం: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఎలవరసు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments