నేటి నుంచి సర్ధార్ షూట్ స్టార్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సర్ధార్ నెల గ్యాప్ తరువాత తాజా షెడ్యూల్ ప్రారంభించారు. ఈరోజు నుంచి సర్ధార్ తాజా షెడ్యూల్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో స్టార్ట్ అయ్యింది. భూత్ బంగ్లా దగ్గర ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్ట్రీట్ సెట్...ఈ స్ట్రీట్ అనుకుని రైల్వే స్టేషన్ సెట్ వేసారు. ఈ సెట్ లో ఈరోజు నుంచి సర్ధార్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
27 రోజులు పాటు ఈ సెట్ లో షూటింగ్ చేయనున్నారు. రైల్వే ష్టేషన్ సెట్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సెట్ కోసం 4.5 కోట్లు ఖర్చు పెట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com