నేటి నుంచి స‌ర్ధార్ షూట్ స్టార్ట్..

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

గుజ‌రాత్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌ర్ధార్ నెల గ్యాప్ త‌రువాత తాజా షెడ్యూల్ ప్రారంభించారు. ఈరోజు నుంచి స‌ర్ధార్ తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ భూత్ బంగ్లాలో స్టార్ట్ అయ్యింది. భూత్ బంగ్లా ద‌గ్గ‌ర ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా స్ట్రీట్ సెట్...ఈ స్ట్రీట్ అనుకుని రైల్వే స్టేష‌న్ సెట్ వేసారు. ఈ సెట్ లో ఈరోజు నుంచి స‌ర్ధార్ షూటింగ్ జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

27 రోజులు పాటు ఈ సెట్ లో షూటింగ్ చేయ‌నున్నారు. రైల్వే ష్టేష‌న్ సెట్ లో ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సెట్ కోసం 4.5 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కోర్టుకు హాజ‌రు కానున్న బ‌న్ని

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ కోర్టుకు హాజ‌రు కావ‌డమేమిట‌ని అనుకుంటున్నారా..కానీ ఇది నిజం. అల్లుఅర్జున్ ఓ భూవివాదం సంద‌ర్భంగా కోర్టు మెట్లాక్కిల్సి వ‌చ్చింది.

భీమవరం టాకీస్ 'బొంబాయి మిఠాయి' ట్రైలర్ ఆవిష్కరణ!

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం'బొంబాయి మిఠాయి'.

రెండు హిట్ సినిమాలు వదిలేసిన రానా...

దగ్గుబాటి రానా బాహుబలి సినిమాలో నటించడం వలన రెండు హిట్ సినిమాలు వదిలేసాడట.ఇంతకీ ఆ రెండు హిట్ సినిమాలు ఏమిటనుకుంటున్నారా..?

క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ ఫిక్స్..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్టాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.

త్రిష పొడిపించుకుంది

ట్రెండీగా ఉండటంలో త్రిష ఎప్పుడూ ఫస్టే ఉంటుంది.ఆల్రెడీ ఎదమీద తేలు బొమ్మతో ఆకట్టుకునే త్రిష తాజాగా మరో టాటూను పొడిపించుకుంది.