సంక్రాంతి కానుకగా సర్ధార్ టీజర్...
Wednesday, January 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రతన్ పూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ విలేజ్ లో పవన్ ని అందరూ సర్ధార్ అని పిలుస్తారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలియచేసారు. అలాగే ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ కాదని చెప్పారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ నటిస్తుంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలను ఏర్పరుచుకున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments