ఫ్యాన్స్ కి న్యూయర్ గిఫ్ట్ ఇస్తానంటున్న సర్ధార్..
Send us your feedback to audioarticles@vaarta.com
గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే..ఇప్పుడు గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సర్ధార్ గబ్బర్ సింగ్ గా రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు నాడు పవన్ అలా నడిచొస్తున్న టీజర్ రిలీజ్ చేస్తేనే కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్..ఇక ఇప్పుడు న్యూయర్ గిఫ్ట్ గా ఫ్యాన్స్ కోసం సర్ధార్ సరికొత్త టీజర్ రెడీ చేస్తున్నాడు.
ఈ టీజర్ లో సీన్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఉంటాయట. జనవరి 1 న రిలీజ్ చేసే ఈ న్యూ ట్రైలర్ ఎంతటి సంచలనం స్రుష్టిస్తుందో..చూడాలి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సర్ధార్ మూవీని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సర్ధార్ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments