'స‌ర్దార్' కి కాజ‌ల్ పాజిటివ్‌ సెంటిమెంట్‌

  • IndiaGlitz, [Monday,March 28 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కాజ‌ల్ తొలిసారిగా జ‌త‌క‌ట్టిన సినిమా 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'. ఏప్రిల్ 8న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది ఈ సినిమా 'మ‌గ‌ధీర' త‌రువాత మ‌రోమారు యువ‌రాణి పాత్ర‌లో కాజ‌ల్ వెండితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నుందీ సినిమా కోసం. ఇదిలా ఉంటే.. 'స‌ర్దార్' ఫ‌లితంపై కాజ‌ల్ ఎంతో న‌మ్మ‌కంగా ఉంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. అదేమిటంటే.. ఏప్రిల్ నెల‌లో కాజ‌ల్ న‌టించగా విడుద‌లైన తెలుగు సినిమాలు మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకోవ‌డం.

2010లో ప్ర‌భాస్‌తో కాజ‌ల్ న‌టించిన 'డార్లింగ్' ఏప్రిల్ 23న విడుద‌లై విజ‌యం సాధిస్తే.. 2011లో అదే ప్ర‌భాస్‌తో జ‌త‌క‌ట్టిన 'మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్' ఏప్రిల్ 22న విడుద‌లై స‌క్సెస్ అయింది. ఇక 2013లో ఎన్టీఆర్‌తో ఆడిపాడిన 'బాద్‌షా' కూడా ఏప్రిల్ 5న విడుద‌లై హిట్ లిస్ట్‌లో చేరింది. ఈ నేప‌థ్యంలో 'స‌ర్దార్' కూడా అదే పాజిటివ్ సెంటిమెంట్ తో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్న‌ది ఈ చంద‌మామ న‌మ్మ‌కం. చూద్దాం.. కాజ‌ల్ న‌మ్మ‌కం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో

More News

ఎన్టీఆర్ 'ఆది' కి 14 ఏళ్లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం 'ఆది'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కూడా ఇదే. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న నంద‌మూరి అభిమానులనే కాదు.

ఉగాదిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..

తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది. ఈ ప‌ర్వ‌దినాన సాధార‌ణంగా కొత్త‌ప‌నులు ప్రారంభిస్తుంటారు. ఇక మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో అయితే కొత్త సినిమాలు ప్రారంభించ‌డం...ఆడియో రిలీజ్ చేయ‌డం...సినిమా రిలీజ్ చేయ‌డం చేస్తుంటారు.ఈసారి కూడా  స్టార్ హీరోలు ఉగాదిని టార్గెట్ చేస్తున్నారు. ఇంత‌కీ ఉగాది రోజున స్టార్ హీరోలు ఏం చేయ‌నున్నార‌నుకుంట&

జాతీయ అవార్డ్ కోసం కంచె తో పోటీపడిన తెలుగు చిత్రాలివే

వరుణ్ తేజ్-ప్రగ్యాజైస్వాల్ జంటగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె.

ఏప్రిల్ 1న 'అప్పుడలా ఇప్పుడిలా' విడుదల

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు.