సర్దార్ గబ్బర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ....

  • IndiaGlitz, [Monday,March 21 2016]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో విడుదలైంది. పవన్ కల్యాణ్ జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన చిత్రమిది. సినిమా సౌతిండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా 800 థియేటర్స్ లో విడుదలవుతుంది. 42 విదేశాల్లో కూడా విడుదలవుతుంది. గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషనల్ సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే...బేసిక్ లైన్ ను థియేట్రికల్ ట్రైలర్ లో చెప్పేశారు.

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం రతన్ పూర్ లో రాజకుంటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఓ శత్రువు ఉంటాడు. అతనే భైరవ్ సింగ్ అతను అక్కడి గనుల కోసం ప్రజలను హింస్తుంటాడు. రాజకుంటుంబానికి చెందిన యువరాణి, ఆమె తాతయ్య ముకేష్ రుషి కూడా భైరవ్ సింగ్ ను ఏమీ చేయలేకపోతుంటారు. ఆ పరిస్థితుల్లో ముకేష్ రుషి స్పెషల్ రిక్వెస్ట్ మీద రతన్ పూర్ గ్రామానికి సి.ఐ.సర్దార్ గబ్బర్ సింగ్ వస్తాడు.

పొగరెక్కి తలరేసే నీలాంటోడు పుట్టిన ప్రతిసారీ తెగ నరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడు.

ఒక్కడివే ఏం చేయగలవు...

ఒక్కడ్నే..ఒక్కడ్నే..ఎక్కడికైనా ఇలానే వస్తా, ఇలానే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ ఎంటర్ టైన్ లా ట్రైలర్ ఉంది. సినిమా అవుటండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లా ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా సినిమాలో ఏముంటుందని ఆలోచించకుండానే థియేట్రికల్ ట్రైలర్ సినిమా ఏంటనేది చెప్పేసింది. అలాగే గబ్బర్ సింగ్ స్టయిల్ ఆఫ్ కామెడి టచ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం కచ్చితంగా కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుంది.