అక్కడ సర్ధార్ థియేటర్ కి వెళ్లండి.. ఫ్రీగా డ్రింక్ త్రాగండి..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ధియేటర్ కి వెళితే..కూల్ డ్రింక్ ఫ్రీ...! ఇంతకీ ఈ అవకాశం కల్పిస్తున్న థియేటర్ ఎక్కడ..? అనుకుంటున్నారా..? మెగా బ్రదర్స్ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు శ్రీదేవి జానకి మినీ థియేటర్ లో. ఈ థియేటర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగానే ప్రారంభమైంది.
ఈ థియేటర్ లో ఈనెల 8 నుంచి పవర్ స్టార్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని ప్రదర్శించనున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ రోజున అన్ని షోలకు కూల్ డ్రింక్ ఫ్రీగా ఇస్తారట. ఈ విషయాన్ని తెలియచేస్తూ..అక్కడ బేనర్స్ కూడా కట్టడం విశేషం. అక్కడ సమ్మర్ లో సర్ధార్ చూస్తే..కూల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments