'సర్ధార్ గబ్బర్ సింగ్' టీజర్ రివ్యూ...

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు, పెద్దలు ఎవరికైనా అతని స్టయిల్ అంటే ఇష్టం...అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను ట్రెండ్ ఫాలోకాను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అని అన్నపవర్ స్టార్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ఎందుకంటే తనేది చేసిన ట్రెండే. మెగాస్టార్ అనే మర్రిచెట్టు నీడలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరైన పవర్ స్టార్ తనదైన స్టయిల్ తో తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. తనకి హిట్స్, ప్లాప్స్ తో సంబంధంలేదు. అందుకే వరుస ప్లాప్స్ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇండస్ట్రీ రికార్డులను సాధించడం పవన్ కళ్యాణ్ కే సాధ్యమైంది. అత్తారింటికి దారేది' వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీకి కొత్త మైలురాళ్లను క్రియేట్ చేశాడు. ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

చిరంజీవి పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే తన లెక్కలు ఇప్పుడే స్టార్టయిందని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు విడుదలైన టీజర్ గురించి సింపుల్ గా ఒక్కమాటలో చెప్పుకోవచ్చు, దటీజ్ మోస్ట్ అవెయింట్ టీజర్ బై టాలీవుడ్...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో రిలీజ్ అయిన టీజర్ ఎలా ఉంటుందోనని అభిమానులే కాదు ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూసింది. మరి ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం...

33 సెకన్ల నిడివితో టీజర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్ అనే టైటిల్ తో టీజర్ స్టార్టవుతుంది. గుర్రం నడుచుకుంటూ వస్తుంటుంది. తర్వాత నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ అనే టైటిల్ రాగానే పవన్ కళ్యాణ్ గన్స్ తోనడిచివస్తుంటాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే టైటిల్ రాగానే గుర్రం, పవన్ కళ్యాణ్ షాడో కనపడుతుంది. చివరికి పవర్ స్టార్ గుర్రం కళ్ళెం పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే టీజర్. ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ సర్ధార్ గబ్బర్ సింగ్, హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ అనే టైటిల్ తో టీజర్ ముగుస్తుంది.

ఇక ఇందులో దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. గబ్బర్ సింగ్ టైటిల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నే అలాగే అందించినా ప్రెజంటేషన్ తీరు డిఫరెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంది. డైలాగ్స్ ఏమీ లేవు, టీజర్ చిన్నదిగా ఉన్నప్పటికీ పవర్ స్టార్ అభిమానులు ఎక్స్ పెక్టేషన్స్ రేంజ్ లో ఉండటం ఆనందదాయకం. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సర్దార్ గబ్బర్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని టీజర్ చెప్పకనే చెప్పింది. సో వెయిట్ ఫర్ సర్ధార్ గబ్బర్ సింగ్ ట్రెండ్ సెట్టింగ్....

.....హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.....

More News

మళ్లీ ఫిక్సయింది...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన

అందుక‌నే హోరా హోరి మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం : క‌ళ్యాణి మాలిక్

ఐతే, బాస్, అష్టాచ‌మ్మా, అలా..మొద‌లైంది, ఊహ‌లు గుస‌గుస‌లాడే...ఇలా విభిన్నక‌థా చిత్రాల‌కు మ్యూజిక్ అందించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి మాలిక్.

25 రోజుల్లో 154 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన 'శ్రీమంతుడు'

60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆరు నెలల్లో నిర్మించిన 'శ్రీమంతుడు' 25 రోజులకే 154 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

వైజాగ్ వెళ్తున్న సునీల్‌

సునీల్ తాజా సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

4న జ‌య‌సూర్య విడుద‌ల‌

పందెంకోడి, పొగ‌రు, భ‌ర‌ణి, పూజ‌, మ‌గ‌మ‌హారాజు వంటి సినిమాల్లో న‌టించిన విశాల్ హీరోగా న‌టించిన జ‌య‌సూర్య ఈ నెల 4న విడుద‌ల కానుంది.