సర్ధార్ స్పెషల్ షోకి పెరుగుతున్న డిమాండ్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుకగా ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సర్ధార్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులైతే...సర్ధార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఏప్రిల్ 8 ఎప్పుడు వస్తుంది..? ఎప్పుడు సర్ధార్ సినిమాని చూస్తామా అని ఆశక్తితో ఎదురుచూస్తున్నారు.
సర్ధార్ సినిమాని విడుదల రోజు కంటే ఒకరోజు ముందు అంటే ఈనెల 7వ తేదీ రాత్రి తెలుగు రాష్ట్రాల్లో సర్ధార్ స్పెషల్ షోలు ప్లాన్ చేసారు. ఈ సినిమా పై ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని సర్ధార్ స్పెషల్ షో కి టిక్కెట్ల రేట్లు భారీగా పెంచారు. అయినా టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడైపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ధియేటర్స్ లో సర్ధార్ స్పెషల్ షోస్ ప్లాన్ చేసారు. ఈ స్పెషల్ షోస్ తో రికార్డు స్ధాయి కలెక్షన్స్ వస్తాయని తెలుస్తుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న ఇంట్రస్ట్ చూస్తుంటే సర్ధార్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com