సర్ధార్...కోసం శ్రేయా ఘోషల్..

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సెన్సేష‌న‌ల్ మూవీకి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ - శ్రేయా ఘోష‌ల్ క‌ల‌సి ఓ పాట పాడారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా దేవిశ్రీ తెలియ‌చేసారు.
అంతే కాదండోయ్..పాట రికార్డింగ్ టైమ్ లో శ్రేయా ఘోష‌ల్ తో క‌ల‌సి తీసుకున్న ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. శ్రేయా పాట బాగా పాడారు అంటూనే త‌న‌దైన శైలిలోఈ పాట విన‌డానికి రెడీగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు దేవిశ్రీ. శ‌ర‌త్ మ‌రార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియోను ఈనెల 20న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప‌వ‌న్ - కాజ‌ల్ జంట‌గా నటిస్తున్నీఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌నున్నారు.