స‌ర్ధార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

  • IndiaGlitz, [Thursday,March 10 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే స‌ర్ధార్ రిలీజ్ డేట్ కి నెల రోజులు మాత్ర‌మే టైం ఉండ‌డం...ఇంకా షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో సినిమా వాయిదా పడే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

ఈ ప్ర‌చారానికి తెరదించేలా స‌ర్ధార్ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ట్విట్ట‌ర్ లో... స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, కానిస్టేబుల్, గ‌న్స్ అండ్ గ్యాంగ్స్ అంద‌రూ ఏప్రిల్ 8న సినిమాని రిలీజ్ చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారంటూ ప‌వ‌న్, ఆలీ త‌దిత‌రులు ఉన్న‌ వ‌ర్కింగ్ స్టిల్ ఒక‌టి పోస్ట్ చేసారు. నెక్ట్స్ వీకెండ్ ఆడియో రిలీజ్ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఆడియో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం. స‌ర్ధార్ సినిమాని మాత్రం ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌నున్నాం అంటూ స్పందించారు.సో...స‌ర్ధార్ ఏప్రిల్ 8న రిలీజ్ అవ్వ‌డం ఖాయం.