కేక పుట్టిస్తున్న సర్ధార్ ఐటం సాంగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక...అనే ఐటం సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటను దేవిశ్రీప్రసాద్ మ్యాజిక్ (మ్యూజిక్)తో అదిరింది అనిపించారు. ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఐటం సాంగ్ కెవ్వు కేకను మించేలా ఉంది. సర్ధార్ గబ్బర్ సింగ్ కోసం లక్ష్మీరాయ్, పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించిన తోబ తోబా... తోబ తోబా...తోడు ఉంది దిల్లు రుబా..అంటూ సాగే ఐటం సాంగ్ కేక పుట్టిస్తుంది.
ఈ ఐటం సాంగ్ 30 సెకన్స్ విజువల్స్ ను సర్ధార్ టీమ్ రిలీజ్ చేసింది. పాట వింటుంటేనే అదిరింది అనిపించిన ఈ ఐటం సాంగ్ 30 సెకన్స్ విజువల్స్ చూసిన తర్వాత ఫుల్ సాంగ్ ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఈ పాటను థియేటర్ లో చూస్తే...ఫ్యాన్స్ విజిల్సే విజిల్స్. ఈ ఐటం సాంగనే కాకుండా సర్ధార్ గబ్బర్ సింగ్ లో ప్రతి పాటకు విన్న వెంటనే నచ్చేలా క్యాచీ ట్యూన్స్ అందించారు దేవిశ్రీప్రసాద్. సర్ధార్ రిలీజ్ తర్వాత సాంగ్స్ మరింత పాపులర్ అవ్వడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments