అత్తారింటికి దారేది లోనే కాదు..సర్ధార్ లో కూడా..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డం కోసం డే అండ్ నైట్ వ‌ర్క్ చేస్తున్నారు. స‌ర్ధార్ సినిమాని అభిమానుల‌కు అంకితం ఇస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డంతో స‌ర్ధార్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అభిమానుల‌ను అల‌రించ‌డం కోసం ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌ద‌ల‌డం లేద‌ట ప‌వ‌న్.
ఇక అస‌లు విష‌యం ఏమిటంటే...అత్తారింటికి దారేది..చిత్రంలో ప‌వ‌న్ పాడిన కాటం రాయుడా...పాట ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో కూడా అభిమానుల‌ను అల‌రించ‌డం కోసం ప‌వ‌న్ పాట పాడిన‌ట్టు స‌మాచారం. పోతురాజు..పోతురాజు అంటే సాగే ఈ పాట ఐడియాను దేవిశ్రీప్ర‌సాద్ కి స్వ‌యంగా ప‌వ‌నే ఇచ్చాడ‌ట‌. ఆడియో ఫంక్ష‌న్ లో ఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతోనే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ పాట పాడిన విష‌యం గురించి స‌ర్ధార్ టీమ్ సైలెంట్ గా ఉంద‌ట‌. ఈ పాట ఒక నిమిషం పాటు ఉంటుంద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే ఈ పాట ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయం. మ‌రి..ఇది నిజ‌మా కాదా అనేది ఈనెల 20న జ‌రిగే స‌ర్ధార్ ఆడియో ఫంక్ష‌న్ లో తెలుస్తుంది.