బాలీవుడ్ లో స‌ర్ధార్ సెన్సేష‌న్..

  • IndiaGlitz, [Monday,March 14 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో రోజురోజుకి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా స‌ర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఒకేరోజు రిలీజ్ చేస్తున్నార‌న్న వార్త తెలియ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. దాదాపు 800 స్ర్కీన్స్ లో స‌ర్ధార్ ని బాలీవుడ్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ నెల 20న స‌ర్ధార్ ఆడియోను రిలీజ్ చేయ‌నున్నారు. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని రిలీజ్ చేయ‌డం కోసం టీమ్ అంతా చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌ర్ స్టార్ సినిమా తెలుగు, హిందీలో ఒకేసారి రిలీజ్ చేయ‌డం జ‌ర‌గ‌లేదు. ఫ‌స్ట్ టైం తెలుగుతో పాటు హిందీలో కూడా ప‌వ‌న్ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండ‌డంతో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సెన్సేష‌న్ స్టార్ట్ అవుతుంది. మ‌రి...ఈ సెన్సేష‌న్ ఏరేంజ్ లో ఉంటుందో...ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

బుల్లెట్ రాణి నాకొక బిగ్ ఛాలెంజ్ : నిషా కొఠారి

ఇప్పటివరకు తాను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో "బుల్లెట్ రాణి" లో చేసిన ఇన్స్ పెక్టర్ రాణి  పాత్ర తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ క్యారెక్టర్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేసానని "బుల్లెట్ రాణి" కథానాయకి నిషా కొఠారి పేర్కొంది.

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ప్రేమికుడు ఆడియో రిలీజ్..

మానస్.ఎన్,సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమికుడు.

అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి,కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

గోపీచంద్ వద్దన్నాడు..బన్ని చేస్తున్నాడు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బొలివియాలో షూటింగ్ కూడా ముగిసింది. సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స‌ర్ధార్ త‌ర్వాత ఇక రెండు లేక మూడు సినిమాలు చేస్తాను అంతే... - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ....ఈ పేరులో ఎంత ప‌వ‌ర్ ఉందో...ఈ పేరుకి ఎంత క్రేజ్ ఎందో అంద‌రికీ తెలిసిందే. కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇదంతా మాయ‌...ఆ దేవుడి ద‌య‌..అంటూ అధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు.