'సర్దార్' కోసం మరింత గ్లామర్‌గా..
- IndiaGlitz, [Saturday,April 02 2016]
తన కెరీర్ మొత్తమ్మీద కాజల్ అగర్వాల్ చాలా గ్లామరస్‌గా కనిపించిన చిత్రం 'మగధీర'. ఆ సినిమాలో కాజల్ అందచందాలు చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. ఆ తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించినా.. 'మగధీర' స్థాయిలో దర్శనమివ్వలేదన్నది చాలామంది అభిప్రాయం. బహుశా యువరాణిగా ఆమె అంత బాగా సూటవ్వడం వల్లే అలా అనిపించి ఉండవచ్చు. అయితే.. 'మగధీర' స్థాయి గ్లామరసాన్ని తన కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో చూడొచ్చంటోంది కాజల్.
'మగధీర' శైలిలోనే ప్రిన్సెస్ గా తను కనిపించనున్న ఈ సినిమాలో తన వస్త్రధారణ మరోసారి మెప్పు పొందుతుందని కాజల్ ధీమాగా చెప్పుకొస్తోంది. ఇప్పటికే రిలీజైన కాజల్ స్టిల్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి కాబట్టి.. 'సర్దార్'కి కాజల్ గ్లామర్ ఓ ఎస్సెట్ గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నెల 8న 'సర్దార్' ప్రేక్షకుల ముందుకు రానుంది.