సర్ధార్ సెన్సార్ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కాజల్ జంటగా నటించిన చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించారు. ఈ సెన్సేషనల్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ ఒక్క సింగిల్ కట్ కూడా చెప్పకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
అయితే స్విట్జర్లాండ్ లో రెండు పాటలను చిత్రీకరించాలి. ఈ రెండు పాటలను సెన్సార్ చేయాల్సివుంది. రెండు రోజుల్లోనే ఈ రెండు పాటల సెన్సార్ ని కూడా పూర్తి చేయనున్నారు. నిర్మాత శరత్ మరార్ ప్రపంచ వ్యాప్తంగా సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com