బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నసర్ధార్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్. బాబీ తెరకెక్కిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను 21 కోట్లు, సీడెడ్ 10.5 కోట్లు, ఆంధ్రా 30 కోట్లు, ఓవర్ సీస్ 10.5 కోట్లుకు సొంతం చేసుకున్నారు. అలాగే సర్ధార్ శాటిలైట్ రైట్స్ ని 14కోట్లు అమ్మడం జరిగింది.
హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నికలుపుకుని ఈ సినిమాకి దాదాపు 104 కోట్లుకు పైగా బిజినెస్ అయ్యింది. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ రికార్డ్. ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సర్ధార్ మూవీని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సర్ధార్ రిలీజ్ తర్వాత ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com