సర్ధార్ ఆడియోకు అంత బడ్జెట్టా
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సర్ధార్ ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సర్ధార్ ఆడియోను మార్చి ప్రధమార్ధంలో రిలీజ్ చేయనున్నారు. అయితే సర్ధార్ ఆడియో వేడుకను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారీ స్ధాయిలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలనుకుంటున్నారట.
ఈ ఆడియో ఫంక్షన్ కోసం కోటి పాతిక లక్షలు బడ్జెట్ అనుకుంటున్నారట. అలాగే అభిమానులు భారీగా తరలి వచ్చేందుకు కావలసిన ఏర్పాట్లపై చర్చిస్తున్నారట. ఈ భారీ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం...అలాగే మెగా హీరోలందరూ హజరవుతుండడం ఓ విశేషం. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఫర్ ఫార్మెన్స్ ఆడియోకు హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట. మరి..ఆడియోతో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న సర్ధార్ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com