'సర్దార్ ' తో బ్రేక్ పడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌కి మంచి పేరుంది. కానీ ఓ విషయంలో మాత్రం ఈ సంగీత తరంగం ఆ ఫ్యామిలీ హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో అయినా దానికి బ్రేక్ వేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ అసలు విషయమేమిటంటే.. 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' కి సీక్వెల్‌గా చిరంజీవి చేసిన 'శంకర్‌దాదా జిందాబాద్'.. 'ఆర్య'కి సీక్వెల్‌గా అల్లు అర్జున్ చేసిన 'ఆర్య 2'కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. హీరో క్యారెక్టరైజేషన్ పరంగా సీక్వెల్లాంటి ఈ సినిమాలకు డి.ఎస్.పి మ్యూజిక్ వర్కవుట్ అయినా.. సినిమాలు మాత్రం డిజాస్టర్స్‌గా మిగిలాయి.
ఇప్పుడు.. 'గబ్బర్‌సింగ్'కి క్యారెక్టరైజేషన్ పరంగా సీక్వెల్‌గా వస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్'కి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. మరి ఈ సినిమాతో అయినా ఆ అంశానికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com