'సర్దార్ ' తో దేవిశ్రీ సమస్య తీరేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తోటి తెలుగు సంగీత దర్శకుల్లో మరెవరికి దక్కని అవకాశం యువ సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌కి దక్కుతోంది. అయితే.. తన పనితీరుకి మార్కులు పడుతున్నా..దేవిశ్రీకి ఓ సమస్య మాత్రం ఎదురవుతోంది. దానికి సంబంధించి కాస్త వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఆడపాదడపా సీక్వెల్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ కథానాయకులతో రూపొందే సీక్వెల్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. ఈ విషయంలో మెగా హీరోలది ప్రత్యేక స్థానం. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్‌లతో సీక్వెల్ కాని సీక్వెల్ చిత్రాలు వచ్చాయి.
చిరంజీవి 'శంకర్ దాదా' సీరీస్ చేస్తే.. బన్ని 'ఆర్య' సిరీస్ చేశాడు. ఈ రెండింటికీ దేవిశ్రీనే స్వరకర్త. ఇప్పుడు ఈ జాబితాలో మరో మెగా హీరో కూడా చేరనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' సిరీస్‌లో వస్తున్న పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' నే ఆ సినిమా. కథ పరంగా కాకుండా క్యారెక్టరైజేషన్, టైటిల్ పరంగా ఈ సినిమాలు సీక్వెల్స్‌గా తెరకెక్కాయి. ఇదిలా ఉంటే.. చిరు, బన్ని విషయంలో సీక్వెల్ పరంగా సక్సెస్‌లను తన వశం చేసుకోని దేవిశ్రీకి.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఇమేజ్‌తోనైనా ఆ సమస్య తీరుతుందేమో చూడాలి. 'సర్దార్ గబ్బర్‌సింగ్' ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments