'సర్దార్ ' తో దేవిశ్రీ సమస్య తీరేనా?

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

తోటి తెలుగు సంగీత ద‌ర్శ‌కుల్లో మ‌రెవ‌రికి ద‌క్క‌ని అవ‌కాశం యువ సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ద‌క్కుతోంది. అయితే.. త‌న ప‌నితీరుకి మార్కులు ప‌డుతున్నా..దేవిశ్రీ‌కి ఓ స‌మ‌స్య మాత్రం ఎదుర‌వుతోంది. దానికి సంబంధించి కాస్త వివ‌రాల్లోకి వెళితే.. తెలుగులో ఆడ‌పాద‌డ‌పా సీక్వెల్ చిత్రాలు విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ప్ర‌ముఖ క‌థానాయ‌కుల‌తో రూపొందే సీక్వెల్స్ అప్పుడ‌ప్పుడు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో మెగా హీరోల‌ది ప్ర‌త్యేక స్థానం. ఇప్ప‌టికే చిరంజీవి, అల్లు అర్జున్‌ల‌తో సీక్వెల్ కాని సీక్వెల్ చిత్రాలు వ‌చ్చాయి.

చిరంజీవి 'శంక‌ర్ దాదా' సీరీస్ చేస్తే.. బ‌న్ని 'ఆర్య' సిరీస్ చేశాడు. ఈ రెండింటికీ దేవిశ్రీ‌నే స్వ‌ర‌క‌ర్త‌. ఇప్పుడు ఈ జాబితాలో మరో మెగా హీరో కూడా చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. 'గ‌బ్బ‌ర్ సింగ్' సిరీస్‌లో వ‌స్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్ సింగ్' నే ఆ సినిమా. క‌థ ప‌రంగా కాకుండా క్యారెక్ట‌రైజేష‌న్‌, టైటిల్ ప‌రంగా ఈ సినిమాలు సీక్వెల్స్‌గా తెర‌కెక్కాయి. ఇదిలా ఉంటే.. చిరు, బ‌న్ని విష‌యంలో సీక్వెల్ ప‌రంగా స‌క్సెస్‌ల‌ను త‌న వశం చేసుకోని దేవిశ్రీ‌కి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ ఇమేజ్‌తోనైనా ఆ స‌మ‌స్య తీరుతుందేమో చూడాలి. 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

వాటినే నమ్ముకున్న హన్సిక

తెలుగులో కాస్త జోరు తగ్గించినా..తమిళంలో మాత్రం బాణంలా దూసుకుపోతోంది అందాల తార హన్సిక.

అంకిత-విశాల్ వివాహాం

1980లో ఐ లవ్ యు రస్నా...!అంటూ...ముద్దుముద్దు మాటలతో పలకరించి...ఆతర్వాత లాహిరి లాహిరి లాహిరి చిత్రం

నాగార్జున 'శ్రీరామదాసు' కి పదేళ్లు

'అన్నమయ్య','సంతోషం' చిత్రాల తరువాత అక్కినేని నాగార్జునకి ముచ్చటగా మూడోసారి నంది అవార్డుని అందించిన చిత్రం' శ్రీరామదాసు'.

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న నాగార్జున, కార్తీ, పివిపిల 'ఊపిరి'

కింగ్ నాగార్జున,ఆవారా కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి.సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు,తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి,కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'.

ఏప్రిల్ 1 వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 7 టు 4.

రాత్రి 7గంటల నుండి ఉదయం 4గంటల వరకు పూర్తిగా ఒక రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం '7టు 4'.