పవన్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న సెంటిమెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో రెండు పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏప్రిల్ 1 కుదరకపోతే ఏప్రిల్ 2న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఫస్ట్ టైం పవర్ స్టార్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 800 థియేటర్లో బాలీవుడ్ లో సర్ధార్ రిలీజ్ అవుతుంది. అయితే పవన్ బాలీవుడ్ ఎంట్రీ పవన్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లో ప్రతిబంథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 1990లో రిలీజైన ప్రతిబంథ్ సినిమాలో చిరు పోలీస్ గా నటించారు. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
చిరు తర్వాత చిరు తనయుడు రామ్ చరణ్ కూడా బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అపూర్వ లాఖియా తెరకెక్కించారు. జంజీర్ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ చేసారు. అటు బాలీవుడ్ - ఇటు టాలీవుడ్ రెండింటిలో ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ బాలీవుడ్ లో సక్సెస్ సాధించలేకపోయారు. వీరికి సెంటిమెంట్ గా మారిన విషయం ఏమిటంటే...చిరంజీవి ప్రతిబంధ్, రామ్ చరణ్ జంజీర్ చిత్రాల్లో పోలీస్ గా నటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పోలీస్ గానే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. పోలీస్ పాత్ర మెగా హీరోలకు కలసిరాలేదు. యాధృచ్చికంగానే జరిగినా...ఈ సెంటిమెంట్ తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. మరి...పవన్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారో...ఫాలో అవుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com