అమరావతిలో సర్ధార్ ఆడియో..

  • IndiaGlitz, [Monday,February 22 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స‌ర్ధార్ ఆడియోను మార్చి 12 కానీ 20 కానీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆడియో ఫంక్ష‌న్ ఎక్క‌డ చేయాల‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు.
కాక‌పోతే ప‌వన్ క‌ళ్యాణ్ మాత్రం అమరావ‌తిలో చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. మార్చి 25కి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా శ‌ర‌వేగంగా షూటింగ్ చేస్తున్నారు. బాల‌య్య డిక్టేట‌ర్ ఆడియోను అమ‌రావ‌తిలో రిలీజ్ చేసారు. మ‌రి...ప‌వ‌న్ బాల‌య్య‌ను ఫాలో అయి అమ‌రావ‌తిలో స‌ర్ధార్ ఆడియో రిలీజ్ చేస్తారా..? లేక హైద‌రాబాద్ లో ఆడియో రిలీజ్ చేస్తారా అనేది ఈవారంలో నిర్ణ‌యిస్తార‌ట.