సర్ధార్ రిలీజ్ లో మార్పు..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ..ఏప్రిల్ మహేష్ బ్రహ్మోత్సవం, బన్ని సరైనోడు సినిమాలు రిలీజ్ ఉండడంతో..సర్ధార్ సినిమాని మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి..ఇంట్రస్టింగ్ గా జరిగే ఈ సమ్మర్ వార్ లో విన్నర్ ఎవరో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments