కంటెంటే 'నేనోరకం' సక్సెస్ కు ప్రధాన కారణం - శరత్ కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
కంటెంటే హైలెట్ తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకాదరణ ఉంటుందని నేనోరకం సినిమా మరోసారి ఫ్రూవ్ చెసిందన్నారు శరత్ కుమార్. సాయిరామ్ శంకర్ హీరోగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం" నేనోరకం". సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో విభా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది. ఈసందర్బంగా " నేనోరకం "సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది.
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. బంపర్ ఆఫర్ అనంతరం నాకు మళ్లీ సక్సెస్ రావటానికి ఐదెళ్ల సమయం పట్టింది. నేనోరకం సక్సెస్ నాకు రీ ఎంట్రీ లాంటిది. దర్శక నిర్మాతలు ఈ హిట్ సినిమాలో నన్ను హీరొగా ఎంచుకున్నందుకు దన్యవాదాలన్నారు. ఇక నుంచి సెలెక్టెడ్ గా సినిమాలు చెస్తానన్నారు.
శరత్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడి కథే ఈ సినిమాకు హైలెట్. ఆడియెన్స్, క్రిటిక్స్ ఈ సినిమాను తమవంతుగా పబ్లిసిటీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. తమిళ్ లో ఈ సినిమాను నేను త్వరలొ విడుదల చెస్తాను.కుటుంబమంతా, ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను తప్పక చూడాలన్నారు.
దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ..కంటేంట్ హైలెట్ గా తెరకెక్కిన మా సినిమా క్రిటిక్స్ సపొర్ట్ తో, ఆడియెన్స్ మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది. నిర్మాత శ్రీకాంత్ మొదలు సాయి గారు, శరత్ గారు నాకు ఈ సినిమా విషయంలో చాలా సపొర్ట్ చేశారు. సెకండాఫ్ లో సాయిరామ్ శంకర్ -శరత్ కుమార్ ల మధ్య వచ్చె సీన్స్ ఆడియెన్స్ ను థ్రిల్ ను కలిగిస్తున్నాయి. మహిత్ ఆర్.ఆర్. మంచి ఎసెట్ గా నిలిచింది. శరత్ కుమార్ గారు తెలుగు సినిమాల్లో ఏ పాత్రనైనా చెయగల సమర్దులు. కొత్త, పాత అన్న భేదం లేకుండా అందరికి అందుబాటులో ఉండే ఏకైక సూపర్ స్టార్ అన్నారు.
నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... మా సంస్థ ద్వారా వచ్చిన తొలి చిత్రాన్నె ఓ సరికొత్త కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాము. ఆడియోన్స్ తో పాటు, క్రిటిక్స్ ను కూడా మా సినిమా ఆకట్టుకుంది.
మా బ్యానర్ పై మరిన్ని మంచి సినిమాలను తెరమీదకు తీసుకువస్తామన్నారు.
సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. మా అన్న చక్రి కి పూరీ గారు బ్రేక్ ఇస్తే.. నాకు పూరీ గారి తమ్ముడు సాయి రామ్ శంకర్ గారు బ్రేక్ ఇచ్చారు. మా యూనిట్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా విజయంతో లభించిందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, కమెడియెన్ వైవా హర్ష పాల్గొని చిత్ర విజయం పై ఆనందాన్ని వ్యక్త పరిచారు.
రేష్మీ మీనన్ కధానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ద్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments