విశాల్ ట్వీట్ - శరత్ కుమార్ కు హార్ట్ ఎటాక్...

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

ఓ వైపు హీరోగా స‌క్సెస్ సాధిస్తూ...మ‌రో వైపు న‌డిగ‌ర సంఘంలోను స‌క్సెస్ సాధించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న‌హీరో విశాల్. హీరోగా, న‌డిగ‌ర సంఘం నాయ‌కుడుగా వార్త‌ల్లో నిలుస్తున్న విశాల్...సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో ప‌డ్డాడు అంటూ కూడా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. విశాల్ - వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంది అంటూ వార్త‌లు రావ‌డ‌మే కానీ..ఈ విష‌యం పై క్లారిటీ లేదు. అయితే..న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ తో విశాల్ పోటీప‌డ‌డంతో ఇక విశాల్ - వ‌ర‌ల‌క్ష్మి ప్రేమకు ఫుల్ స్టాఫ్ ప‌డిన‌ట్టే అనుకున్నారు.

ఇదిలా ఉంటే....అంద‌రి అనుమానాల‌కు చెక్ పెడుతూ విశాల్ వ‌ర‌ల‌క్ష్మితో తీసుకున్న సెల్ఫీని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఈ ఫోటోనే స‌మాధానం అంటూ ట్వీట్ చేసాడు. దీంతో విశాల్ వ‌ర‌ల‌క్ష్మితో ల‌వ్ గురించి క్లారిటీ ఇచ్చేసాడు అంటూ కోలీవుడ్ లో వార్త‌లు ప్రారంభం అయ్యాయి. అయితే...విశాల్ ఈవిధంగా ట్వీట్ చేసిన స‌మ‌యంలోనే శ‌ర‌త్ కుమార్ హార్ట్ ఎటాక్ వ‌చ్చి హాస్ప‌ట‌ల్ లో చేరడం త‌మిళ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆత‌ర్వాత రాధిక శ‌ర‌త్ కుమార్ కి హార్ట్ ఎటాక్ రాలేదు కేవ‌లం ఫుడ్ పాయిజ‌న్ అయ్యింది అంతే అంటూ క్లారిటీ ఇచ్చారు.

More News

తమిళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో,ప్రేమమ్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఖైదీగా చిరు నెంబర్ నాడు 786..నేడు..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

101వ చిత్రాన్ని ప్రకటించిన బాలయ్య.....

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు.

రజనీకాంత్ - జాకీచాన్ కాంబినేషన్ లో మూవీ..

రజనీకాంత్ అంటే స్టైల్...జాకీచాన్ అంటే యాక్షన్...అందుకనే స్టైల్ లో కింగ్ రజనీ..యాక్షన్ లో కింగ్ జాకీచాన్ అంటుంటారు.

ఒక మనసు డైరెక్టర్ నెక్ట్స్ మాస్ చిత్రం

మల్లెలతీరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే అభిరుచిగల దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న దర్శకుడు రామరాజు.