‘సారంగదరియా’ ఎంత హైపో.. అంతే విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
యూట్యూబ్ సెన్సేషన్.. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్.. తెలంగాణ పల్లె నుంచి పుట్టిన పురాతన ట్యూన్.. ఆకట్టుకునే పదాలు.. అదరగొట్టే సాయిపల్లవి స్టెప్పులు.. మొత్తానికి ‘సారంగదరియా’ సాంగ్ వావ్ అనిపించేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోనిదే సారంగదరియా సాంగ్. ఈ పాటకు ఒక్కరోజులోనే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అదే రేంజ్లో విమర్శల పాలవడం కూడా గమనార్హం. పాట పాడటం నుంచి రాసిన సుద్దాల అశోక్ తేజ వరకూ అందరిపై విమర్శల వర్షం కురుస్తోంది.
నిజానికి ఈ పాట ఒక మేల్ వాయిస్ చేత పాడించాలి కానీ మంగ్లీ చేత పాడించారు. ఆమె పాడిన విధానం చాలా బాగా ఆకట్టుకునేలా ఉంది కానీ మేల్ వాయిస్ చేత పాడించాల్సిన పాటను మంగ్లీ చేత పాడించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. విపరీతంగా విమర్శల పాలవుతున్న వ్యక్తి.. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. నిజానికి ఈ పాట తెలంగాణ పల్లెల్లో చాలా పాపులర్. ఇప్పటికే టిక్‌టాక్‌లో నెటిజన్లు ఎడాపెడా వాడేశారు. నిజానికి కొన్నేళ్ల క్రితం మాటీవీలో ప్రసారమైన రేలారే రేలా కార్యక్రమంలో ఓ జానపద కళాకారిణి ఈ పాటను పాడిందట. ఆ సమయంలో జడ్జిగా ఉన్న సుద్దాల అశోక్ తేజ.. ఇన్నాళ్లకు ఆ పాట ప్రాణ పల్లవిని లేపేశారంటూ టాక్ నడుస్తోంది.
నిజానికి సుద్దాల అశోక్ తేజకు ఇదేమీ కొత్తేమీ కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రంలో కూడా శ్రీశ్రీ పదాలతో పాట కట్టి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా తెలంగాణ పల్లె పాట పల్లవిని లేపేశారు. అయితే కనీసం సుద్దాల అశోక్ తేజ సొంతంగా కొన్ని పంచ్ లైన్స్ కూడా రాసుకోలేరా? అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే ‘సారంగదరియా’ పాటలో అంత్య ప్రాసల కోసం సుద్దాల అష్టకష్టాలు పడ్డారని విమర్శలు వినవస్తున్నాయి. అన్నీ వెరసి సుద్దాల అశోక్ తేజపై విమర్శల వర్షం కురుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout