'సారంగ దరియా..' సరికొత్త రికార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
అది రమ్మన రాదురా చెలియా.. దాని పేరే సారంగ దరియా..’ అంటూ సింగర్ మంగ్లీ పాడిన పాటకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’ చిత్రంలో రీసెంట్‌గా విడుదలైన ‘సారంగ దరియా..’ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా ఈ పాట యాబై మిలియన్ వ్యూస్‌ను చేరుకుని సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పాటకు ఇంత ఆదరణ దక్కడం ఇదే తొలిసారి అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పాట విడుదలైన రెండు వారాల్లోనే ఇలాంటి రికార్డ్‌ను క్రియేట్ చేయడం అనేది సంతోషించదగ్గ విషయం. సాయిపల్లవి పాటకు మరోసారి ప్రేక్షకులు బ్రహరథం పట్టారు.
ఇది వరకు సాయిపల్లవి మారి సినిమాలో ధనుష్‌తో కలిసి చేసిన రౌడీ బేబీ సాంగ్.., ఫిదాలో వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన వచ్చిండే.. సాంగ్‌లను కూడా ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె చైతన్యతో కలిసి చేస్తున్న లవ్‌స్టోరి సినిమాలో ‘సారంగ దరియా..’ పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తోన్న పాటల లిస్టులో చేరింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఏప్రిల్ 16న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com