ముదురుతున్న ‘సారంగదరియా’ వివాదం.. లైవ్‌లోనే కోమలి కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. వ్యూస్‌తో పాటు చర్చల్లో కూడా ఈ సాంగ్ దూసుకుపోతుండటం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమా నుంచి రీసెంట్‌గా ఈ సాంగ్ విడుదలైంది. అయితే సుద్దాల అశోక్ తేజ ఈ సాంగ్ సేకరించారని చిత్ర యూనిట్ చేసిన ప్రకటనపై వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన కోమలి అనే అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈ పాటను కొన్నేళ్ల క్రితం కోమలి ‘రేలారే రేలా’ అనే ప్రోగ్రాంలో పాడింది. ఈ ప్రోగ్రాంకి జడ్జిగా సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు.
ఇన్నేళ్ల తర్వాత ఆ పాటను పదాలు మార్చి సుద్దాల యాజ్ టీజ్‌గా అందించారు. అయితే ఈ పాటకు కర్తను తానేనంటూ సుద్దాల ప్రకటించడంతో కోమలి మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా కోసం ఈ సాంగ్‌ని వాడుకుంటున్నట్లు తనకు చెప్పి.. సుద్దాల అశోక్ తేజ సేకరించినట్లుగా పేరు వేసుకోవడం అన్యాయమని వాపోయింది. ప్రోమో చూశాకనే తాను సేకరించిన సాంగ్ ఇలా వాడేశారని తెలిసిందని, వెంటనే అశోక్ తేజ గారికి ఫోన్ చేసి మాట్లాడితే పెద్దగా స్పందించలేదని పేర్కొంది. అయితే ప్రోమో వచ్చాక డైరెక్టర్ శేఖర్ సార్ తనను పాడతావా? అని అడిగారని.. కానీ గొంతు బాగా లేదని.. తనకు ఒక పది రోజులు టైమ్ ఇవ్వండని అడిగానని తెలిపింది.
అంత సమయం లేదని.. ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తామని మాట ఇచ్చారని తెలిపింది. అలాగే అశోక్ తేజ పక్కనే నీ పేరు కూడా వేస్తామని చెప్పారని... తరువాతి సినిమాలో ఛాన్స్ ఇస్తామని శేఖర్ కమ్ముల అన్నారని కోమలి తెలిపింది. కానీ ఇప్పుడు మాట మార్చి తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో లైవ్ లోనే కోమలి ఏడ్చేసింది. ఇప్పటికైనా తాను కోరుకునేది ఒక్కటేనని, తన పేరు కూడా చిత్రంలో వేయాలని కోరింది. తన పాటను మంగ్లీ పాడటంపై కోమలి స్పందిస్తూ... మంగ్లీ పాడిన పాటలో ఫోక్ లేదని, పల్లెదనం లేదని.. ఆమె పాడిన పాట ఏమీ బాగాలేదని కోమలి తెలిపింది. ఈ పాట మాత్రం తనకు నచ్చలేదని స్పష్టం చేసింది. మొత్తానికి ‘సారంగదరియా’ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com