ఏప్రిల్ 7న 'శరణం గచ్చామి'

  • IndiaGlitz, [Monday,April 03 2017]

భార‌త రాజ్యాంగం రిజ‌ర్వేష‌న్ చట్టంపై బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లేలో తెర‌కెక్కిన చిత్రం "శరణం గచ్చామి'. ప్రేమ్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక జ‌రిగింది.

సినిమా రెండు సంవ‌త్స‌రాల జ‌ర్నీ. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నిర్మాత‌గా నా తొలి చిత్ర‌మిది. అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాకు అనేక అవాంత‌రాలు ఏర్పడినా, వాటిని దాటి ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. ప్రేమ్‌రాజ్‌గారు అంద‌రినీ కులుపుకుపోయి సినిమా అద్బుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో అంబేద్క‌ర్‌గారిపై సుద్ధాల అశోక్‌తేజ్‌గారు రాసిన పాట‌కు క‌చ్చితంగా జాతీయ అవార్డు వ‌స్తుంది. పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావుగారి విలువైన స‌ల‌హాల‌తో ముందుకెళ్ళామ‌ని నిర్మాత ముర‌ళి బొమ్మ‌కు తెలిపారు.

నేను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశాను. వారు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌నిచేసినా, వారు మెసేజ్‌తో కూడిన చిన్న సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారి నుండే నేను మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డాన్ని నేర్చుకున్నాను. నాతో పాటు ప్రొడ్యూస‌ర్‌గారు కూడా అలాంటి ఆలోచ‌న‌తో ఉండ‌టం వ‌ల్ల సినిమా చేయ‌డం సుల‌భ‌మైంది. ఏప్రిల్ 7న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని ప్రేమ్ రాజ్ అన్నారు. అదృష్టం వ‌ల్ల‌నే ఇలాంటి ఓ మెసేజ్ ఉన్న చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందని హీరో న‌వీన్ అన్నారు.

ఈ సినిమాలో రెండు సాంగ్స్ రాసే అవ‌కాశం క‌లిగింది. అంబేద్క‌ర్‌పై పాట రాయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అని సుద్ధాల అశోక్ తేజ్ చెప్పారు. మేం క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ర‌చ‌యిత‌లుగా ప‌నిచేసినా, మెసేజ్‌ల‌తో కూడిన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం చేస్తూ వ‌చ్చాం. ఇప్పుడు మా శిష్యుడు ప్రేమ్‌రాజ్ అదే బాట‌లో ముందుకు సాగుతుండ‌టం ఆనందంగా ఉంది. హీరో న‌వీన్ లుక్ బావుంది. త‌ను మంచి హీరోగా ఎదుగుతాడు. అంబేద్క‌ర్‌లాంటి గొప్ప వ్య‌క్తి స‌మాజం కోసం ఏం చేశాడ‌నేదే ఈ సినిమాలో చెప్పాం. 67 సంవ‌త్స‌రాల‌కు ముందు రూపొందించిన ఈ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం అప్ప‌ట్లో అంద‌మైన బొమ్మ‌లా క‌న‌ప‌డింది. కానీ ఇప్పుడు భూతంలా క‌న‌ప‌డుతుంది. అలా ఎందుకు క‌న‌ప‌డుతుంద‌నేది, దానికి కార‌ణ‌మెవ‌ర‌నేదే అస‌లు క‌థ అని ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌విక‌ళ్యాణ్‌, క‌ళ్యాణ్ స‌మీ త‌దిత‌రులు పాల్గొన్నారు. చిత్ర‌యూనిట్ ప్లాటిన‌మ్ డిస్క్‌ల‌ను అంద‌జేశారు.

నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ, దేశపతి శ్రీనివాస్, సుబ్బారాయశర్మ, మరియు బి.సి.సంఘ నాయకులు-శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సామి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం: రవి కళ్యాణ్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ-జర్నలిస్ట్ సతీష్ చంద్ర, సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి, స్టోరీ-స్క్రీన్ ప్లే- ప్రొడ్యూసర్: బొమ్మకు మురళి, డైలాగ్స్ & డైరెక్షన్: ప్రేమ్ రాజ్ .

More News

అఖిల్ హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున నిర్మిస్తున్న భారీ చిత్రం 'ప్రొడక్షన్ నెం :29'

ఈరోజు నుండి రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ స్టార్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ ఫై

చేతన్ చీను హీరోగా భారీ త్రిభాషా చిత్రం

‘రాజుగారి గది’ఫేమ్ చేతన్ చీను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది.‘సత్యం’ఫేమ్ సూర్యకిరణ్ డైరెక్షన్ లో

'గురు' బాగానే రాబడుతున్నాడు

విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్గా, రితిక సింగ్ శిష్యురాలిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా `గురు`. తమిళంలో, హిందీలో మాధవన్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సుధ కొంగర దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' మోషన్ పోస్టర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.