సరైనోడు అక్కడున్నాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. అల్లు అర్జున్, ఆది పినిశెట్టి లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, ఆదర్శ బాలక్రిష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. అల్లు అర్జున్ స్టైల్ లో ఉంటూనే బోయపాటి యాక్షన్ మిస్ కాకుండా ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఈ మూవీని రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com