స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న సరైనోడు...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటిస్తున్నారు. ఇటీవల బన్ని, మరి కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు.
బన్నిచేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తాయట. ఇక అసలు విషయానికి వస్తే...సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ సరైనోడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న సరైనోడు చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments