స‌రైనోడు ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Thursday,January 21 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను ఈ నెల 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. అందుచేత పుట్టిన‌రోజు కానుకగా ఏప్రిల్ 8 స‌రైనోడు సినిమాని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ అంజ‌లి ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుండ‌డం విశేషం. ఈ పాట‌కి...అలాగే పాట‌లో న‌టించిన అంజ‌లికి ఈ సినిమాలో ప్రాధాన్య‌త ఉంటుంద‌ట‌. అల్లు అర్జున్, బోయ‌పాటి శ్రీను ల తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

అందుకే బాల‌య్య‌తో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా డిక్టేట‌ర్ తీసాను - డైరెక్ట‌ర్ శ్రీవాస్

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్  శ్రీవాస్ తెర‌కెక్కించారు.

'డిక్టేటర్' సక్సెస్ టూర్

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘డిక్టేటర్’.

నితిన్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అ..ఆ...’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

నమిత కొత్త పాత్ర...

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది.తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత తదనంతరం తమిళ తంబీలకు బాగా దగ్గరైంది.

చైతు మూడో హీరోయిన్ ఓకే అయింది...

ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.మలయాళంలో పెద్ద హిట్ అయిన ‘ప్రేమమ్’సినిమాకు రీమేక్ ఇది.