సుశాంత్ ఫామ్ హౌస్ పార్టీలకు సారా.. రియా వచ్చేవారు: రాయిస్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిర్వహిస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును చేతుల్లోకి తీసుకున్న సీబీఐ.. డ్రగ్స్ కోణం బయటపడటంతో దీనికి సంబంధించిన విచారణను ఎన్‌సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కోణానికి సంబంధించి ఇప్పటికే ఎన్‌సీబీ రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ను విచారించింది. అలాగే డ్రగ్ మాఫియాకు సంబంధించిన పలువురు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
అయితే ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి చెందిన లోనావాలా ఫామ్‌హౌస్ కూడా కీలకంగా మారింది. డ్రగ్స్ పార్టీలన్నింటికీ ఇదే కేంద్రంగా మారిందని తెలియడంతో అధికారులు దీనిపై కూడా దృష్టి సారించారు. అయితే తాజాగా లోనావాలా ఫామ్‌హౌస్ మేనేజర్ రాయిస్.. ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తాను లోనావాలా ఫామ్‌హౌస్ మేనేజర్‌గా 2018 నుంచి విధులు నిర్వర్తిస్తున్నానని రాయిస్ తెలిపారు. ఫ్రెండ్స్‌తో కలిసి సుశాంత్ తరచూ అక్కడికి వచ్చేవాడని.. తాను మేనేజర్‌గా చేరిన కొత్తలో సుశాంత్‌తో కలిసి నటి సారా అలీఖాన్ కూడా లోనావాలాకు వచ్చి పార్టీలు చేసుకునే వారని వెల్లడించారు.
ఆ తర్వాత కొంతకాలానికి రియా కూడా వచ్చేదన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండు సార్లు సుశాంత్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చి పార్టీలు చేసుకునే వాడని తెలిపారు. పార్టీల కోసం స్మోకింగ్ పేపర్ ఆర్డర్ చేసేవాడని.. అయితే అదెందుకో తనకు తెలియదన్నారు. లోనావాలాలో జరిగే పార్టీలకు అత్యంత ఖరీదైన వోడ్కాను అతిథులకు అందించడం జరిగేదని తెలిపారు. గతేడాది రియా బర్త్‌డేను కూడా ఆమె తల్లిదండ్రులు, సోదరుడు లోనావాలోనే నిర్వహించారని రాయిస్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com