సందీప్ తో సరదా గర్ల్
Send us your feedback to audioarticles@vaarta.com
జాదూగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ సోనారిక. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న సరదాలోనూ నటిస్తోంది. ఇప్పుడు ఆమె తాజాగా ఓ సినిమాకు సంతకం చేసింది. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాజసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క అమ్మాయి తప్ప అనేది ఆ సినిమా. ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఉపశీర్షికతో రాజసింహ దర్శకత్వంలో ఇటీవల ఈ సినిమా మొదలైంది. ఇటీవలే షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు చోటా.కె.నాయుడు ఛాయాగ్రహాన్ని అందిస్తున్నారు. మిక్కీ స్వరాలను సమకూరుస్తున్నారు. ఫక్తు ఎంటర్ టైనింగ్ గా సాగే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments