సీక్వెల్ తీస్తానంటున్న సప్తగిరి..!
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి...సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా పరిచయమైన యువ నటుడు సప్తగిరి. ఇటీవల రిలీజైన సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా సప్తగిరి మీడియాతో మాట్లాడుతూ....దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా కమెడియన్ అయ్యాను.
అలాగే అనుకోకుండానే హీరో అయ్యాను. హీరోగా నటించినా కమెడియన్ గా నటిస్తాను. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నాం. ఈ చిత్ర నిర్మాత రవికిరణ్ గారే సీక్వెల్ కు కూడా నిర్మాత. 2017లోనే ఈ సీక్వెల్ ఉంటుంది. అలాగే నేను కథానాయకుడుగా, నిర్మాతగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా 2017లోనే ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com